News

రైతులతో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంధ్ర మాట్లాడారు


తపసుపూడి, మంగినపూడి గ్రామాల్లో రైతులతో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంధ్ర మాట్లాడారు. పోర్టు నిర్మాణానికి భూములిచ్చే రైతులకు అన్యాయం చేయమని  చెప్పారు. బందరు మండలం  రైతులు సలహాలు, సూచనలు ఇస్తే వాటిని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం చేస్తామని మంత్రి ప్రకటించారు. రైతుల సమావేశంలో ఎంపీ కొనకళ్ల నారాయణ కూడా పాల్గొన్నారు. తమ తాతల కాలం నాటి నుంచి వచ్చిన భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు.